![]() |
![]() |

రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. వచ్చి రాని తెలుగుతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ తన ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. రష్మీ యానిమల్ లవర్ అన్న విషయం అందరికీ తెలుసు. మూగ జంతువులపై తన ప్రేమ ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ ఫుడ్ సప్లై చేసింది. ఆ వీడియోస్ ని మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. జంతువులపై దాడులకు పాల్పడేవారిని రష్మీ అస్సలు వదిలిపెట్టదు. అలాంటి రష్మీ ఒక బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క చనిపోయింది.
దాని పేరు చుట్కి గౌతమ్. చుట్కి గౌతమ్ తన బేబీ గర్ల్ అని చెప్తూ ఒక పోస్ట్ పెట్టింది. చుట్కి గౌతమ్ మరణించినట్లు ఆ శునకం సమాధిపై రష్మీ పూలమాలలు వేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా చుట్కితో ఎంత ప్రేమగా గడిపిందో చెప్పే ఎన్నో ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు చుట్కి గౌతమ్ కి సంతాపం తెలుపుతున్నారు. "రిప్ చుట్కి..పెయిన్ ఫుల్..స్టే స్ట్రాంగ్...నేను నమ్మలేకపోతున్నాను.. వర్చ్యువల్ గా చుట్కితో చాలా కనెక్ట్ ఐన మేమే ఇంత బాధపడుతున్నాం అంటే మీరెంత బాధపడుతున్నారో అర్ధం చేసుకోగలను. దయచేసి ధైర్యంగా ఉండండి. చుట్కి జ్ఞాపకాలు మీతో ఉన్నాయి..మీ బంగారు చుట్కీ స్వర్గంలో ఆనందంగా ఉంటుంది.. చుట్కీ మీకు దేవుడు ఇచ్చిన బిడ్డ.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బుల్లితెర మీద యాంకర్ గా రష్మీకి వచ్చినంత గుర్తింపు మూవీస్ లో చేసినా రాలేదు. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో ఆడియన్స్ ని అలరించలేదు. దాంతో రష్మీ ఇక బుల్లితెర బెటర్ అని ఫిక్స్ ఐపోయింది.
![]() |
![]() |